ఓ తండ్రీ! నీ రూప భాగాలు చక్కగా ఉన్నాయి మరి నాకెందుకు ఈ శిక్ష
కాళ్ళు చేతులు వంకరగా దృష్టి మరో వైపు వినికిడి మరో చోట ఎందుకిలా
నా అవయవాల లోపం ఏమిటి నడవలేను ఏ పని చేయలేను ఇది కర్మేనా
జీవ కణంలో ఉన్న లోపమా బ్రంహాండంలో జరిగిన కాల గ్రహ ప్రభావాలా
జన్మించుటచే కర్మ ఆరంభమైతే జీవితమంతా విషాద విశ్వ కాల పరీక్షయే
ఇలా ఎందరో జగతిలో ఎన్నో లోపాలతో జీవించడం గత జన్మ పాప కర్మలేనా
నిత్యం ఒకరిపై ఆధారపడి జీవించడం నా మేధస్సుకు కూడా తెలియకపోతున్నది
ఆలోచన భావాలు లేక స్వభావాలు తెలియక జగతిలో అనామకుడిలా జీవిస్తున్నా
No comments:
Post a Comment