ఏనాటి భావాలు ఎక్కడెక్కడ నుండి నా మేధస్సులో ఎక్కడెక్కడ చేరాయి
ఎక్కడెక్కడో కలిగిన భావాలు ఎలాంటివో ఆనాడు నాకెందుకో తెలియవు
నాడు కలుగుతున్న భావాలు ఆనాటి భావాల అర్థాలను తెలుపుతున్నాయి
ఏమైనా ఆనాటి భావాలు నాలో ఉన్నందుకు నేడు విశ్వ విజ్ఞానం తెలుస్తున్నది
ఆనాటి భావాలు నాలో లేకపోతే మరల తెలుసుకునే వీలు ఏనాటికి కలగదు
గత కాలంలో వెళ్ళలేము ఆనాటి వారు భావాలను తెలుపుటకు నేటికీ జీవించలేరు
ఆనాటి నుండి నాలో ఉన్న భావాల అన్వేషణతో విశ్వ విజ్ఞానం నా మేధస్సులో చేరింది
No comments:
Post a Comment