Sunday, December 19, 2010

నేటి సమాజం విశ్వ విజ్ఞానంగా

నేటి సమాజం విశ్వ విజ్ఞానంగా మారాలని అనుకుంటే సరిపోదు
ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తూ ప్రతి రోజు సాగాలి
ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో ప్రతి ఒక్కరు చేసుకుంటూ సాగిపోవాలి
ఏ పని ఎలా ఎప్పుడు చేయాలో విజ్ఞానంగా తెలుసుకొని చేయాలి
ప్రతి ఒక్కరు చదువుకోవాలి అజ్ఞాన అలవాట్లను మానుకోవాలి
శుభ్రతతో జీవిస్తూ ఎలాంటి వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి
సమాజంలో ప్రతి ఒక్కరిని గుర్తించి జీవన విధానాన్ని కల్పించాలి
వృద్దులకు సరైన మార్గాన్ని చూపి సరైన వసతులు కల్పించాలి
శరీర లోపాలు ఉన్నవారికి ప్రాముఖ్యతనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి
ఇంకా ఎన్నో విధాల మంచి పనుల ప్రాముఖ్యతతో విజ్ఞానంగా జీవించాలి

No comments:

Post a Comment