సూర్యాస్తము వలే నీవు నిద్రించే వేళ నీ శరీరంలో చీకటి ఏర్పడుతుంది
ఆకాశాన చంద్ర నక్షత్రాలవలే నీ శరీరంలో ఏ అవయవాలు ప్రకాశిస్తాయి
ఏ ప్రకాశం లేని శరీరం అమావాస్య చీకటిలా అవయవాల స్థితి తెలియక
కనిపించని అవయవాలకు శరీరంలో నేత్ర భావన లేకపోవడం లోపమే
నీకు నేత్ర భావనను కలిగించే ప్రకాశ తత్వ తేజస్సు శరీరంలో ఏర్పడేలా
సూర్య తేజస్సును చూస్తూ కిరణాల కాంతి భావాన్ని మేధస్సులో దాచుకో
సూర్య తేజస్సుతో నీ అవయవాలు మెరుస్తూ ఆరోగ్యంగా నక్షత్రాలవలే ప్రకాశిస్తాయి
సూర్య తేజస్సుతో ధ్యానిస్తే నీ శరీరం విశ్వానికే ఓ కాంతి కేంద్రమై జీవిస్తుంది
No comments:
Post a Comment