చతుర్బుజ కోణ కేంద్రంలో ఉన్న స్థితి విశ్వ స్థితియే
ఈజిప్టులో నిర్మించిన చతుర్భుజ కోణ కేంద్రాలలో అద్భుత స్థితులే
చతుర్భుజ మధ్య స్థానాన్ని చేరుకునే స్థితి గాలి నీరు వేడికి లేవేమో
ఎక్కడో మొదలై మరెక్కడో వదిలిపోయే స్థితులు మధ్య స్థానాన్ని చేరుకోలేవేమో
రాళ్ళను పేర్చిన విధాన శైలి పరిణామం స్థానం మహా నైపుణ్య చతుర్విజ్ఞానం
అద్భుతాలలో మహా అద్భుతమైన నిర్మాణం చతుర్భుజ కోణ కేంద్రమే
చతుర్భుజ కోణ కేంద్రంలో ఉన్న స్థితులు విశ్వ భావాల స్థితులను తెలుపుతాయి
విశ్వంలో కలిగే అద్భుత స్థితులలో చతుర్భుజ కోణ కేంద్రంలో కలిగే స్థితి మరో అద్భుతం
మేధస్సును ధ్యానింపజేయాలన్నా చతుర్భుజ కోణ కేంద్రం మహా ఏకాగ్రత స్థితిని కలిగిస్తుంది
No comments:
Post a Comment