Saturday, December 18, 2010

కాలం ఆగదు కనుకనే ఎన్నో కార్యాలను

కాలం ఆగదు కనుకనే ఎన్నో కార్యాలను ఆనాటి నుండి సాగిస్తున్నాము
కాలం ఆగుతుందని తెలిస్తే కార్యాలు నిలిచిపోతాయనే నిరుత్సాహ భావాలు
మనలో సంకల్ప భావాలు ధృడంగా లేకనే ఎన్నో కార్యాలు ఆగిపోతున్నాయి
మనలో విశ్వ కార్యాలు ఉంటే మహా దృఢమైన సంకల్ప భావాలు అవసరం
ఏ గొప్ప కార్యాన్నైనా సాగించడానికి తగిన సామర్థ్యం మన మేధస్సులో ఉండాలి
ఆలోచనలు ధృడంగా ఉంటేనే కాల కర్మ అనారోగ్య గ్రహ ప్రభావాలను ఎదుర్కోగలం
దైవ శక్తి మనలో ఉన్న గుణ స్వభావమే విశ్వ భావ ఆత్మ తత్వమే అదే సంకల్పం
కాలం ఆగదని సమస్యలు పరిష్కారంతో తొలగిపోతాయని మన మేధస్సుకు తెలుసు
అన్నీ తెలిసినా మనలో ఎన్నో లోపాలు ఉన్నాయంటే కార్య ప్రభావాలు ముడిపడటమే
ముడిని విప్పుతూ కార్యాన్ని దివ్య గుణంతో సాగించండి మహా మార్గం ఏర్పడుతుంది

No comments:

Post a Comment