Saturday, December 18, 2010

మీ మేధస్సు భావాలతోనే మీ కర్మ

మీ మేధస్సు భావాలతోనే మీ కర్మ ప్రభావాలను గ్రహించాను
మీ మేధస్సులలోని ఆత్మ తత్వాల భావాలను తెలుసుకున్నాను
జన్మ ఎక్కడో మరణం మరెక్కడో జీవితం ఎంతటిదో అన్వేషించా
అజ్ఞాన భావమా కాల ప్రభావమా కర్మ చలనమా గమనిస్తున్నా
మేధస్సు లోపించినది ఆత్మ భావాలు విశ్వాన్ని చేరుకున్నాయి
జీవితం లేని జీవన ప్రయాణంలో ఆకలి తీరితే చాలనే ఆలోచన
శరీరం అశుభ్రతతో ఎక్కడంటే అక్కడ ఎలాగంటే అలాగే జీవిస్తున్నది
వర్షమైనా చలైనా వేడైనా గాలైనా నేను అలాగే అలాంటి వాటితోనే
సమాజంలో అరుదుగా కనిపించే జీవితాలైనా మేధస్సును క్షణంలో భ్రమింపజేస్తాయి

No comments:

Post a Comment