ఓ మనిషి ఇంకో మనిషిని చంపాలని అనుకోడు
మనిషిలో ఉన్న భావాలను చంపాలనుకుంటాడు
తనకు కావలసిన భావాలు లేకపోవటంతో చంపేస్తాడు
తనలో లేని గుణాల కోసం ఆర్ధిక ఆశల కోసం చంపేస్తాడు
భావాలను హత మార్చడానికి మనిషినే హత్య చేస్తాడు
ఎన్నో భావాల కోసం ఎందరో ఎందరినో హత్య చేశారు
ఓ మనిషిని హత్య చేసే భావన అర్థం అతనికి తెలియదు
అజ్ఞాన ఆలోచనగా ఆవేదన భావాలతో హత్య చేస్తున్నారు
No comments:
Post a Comment