మనిషిని ఉరి తీయుట భాధ్యతనా కర్తవ్యమా చట్ట కార్యమా
మనిషిని మార్చే గుణాలు మనలో లేకున్నా జీవింపజేయండి
చెరసాలలోనే జీవితమంతా గడిపేలా అతనికి శిక్ష విధించండి
మనిషిలో మార్పు కోసం వివిధ సద్గుణ కార్యాలను చేపట్టండి
మనిషి అజ్ఞాని ఐతే విజ్ఞానాన్ని కలిగించేలా ప్రయత్నించండి
కఠినత్వంతో సమాచారాన్ని రాబట్టడం కన్నా స్వేచ్ఛగా వదిలేయండి
తన జీవితం తనకెందుకు అనే భావనతో తన తప్పు తనకు తెలియాలి
ఉరి తీయుట మానవ ధర్మం కాదు చట్టం క్రూరంగా ఉండకూడదు
ఒక్కసారి ఉరి తీస్తే మరలా అతను జీవించలేడు కుటుంభాన్ని పోషించలేడు
ఓ మనిషి ఖైదీగా మారడానికి అతను ఎదిగే ప్రాంత ప్రభావమా కుటుంబమా
సమాజమా సమస్యల విధానమా స్నేహ శత్రువుల అలావాట్ల ప్రభావమా
విధి వికృత గ్రహచార కాల ప్రభావాల అజ్ఞాన ఆవేదన ప్రభావమా
నేటి వరకు ఉరి తీసిన వారిలో మంచివారు లేరా ఆలోచించండి
No comments:
Post a Comment