విశ్వంలో ఏకీ భవిస్తేనే విశ్వ రూపాల ఆధ్యాత్మ స్వభావాలు నిన్ను ఆకర్షిస్తాయి
నీలో కలిగే ప్రకంపనాలలో విశ్వ రూపాల స్వభావ తత్వాలు నీ ఆత్మలో చేరుతాయి
విశ్వ తత్వాలతో విశ్వాత్మగా పరమాత్మవలే జీవిస్తావని విశ్వ విధాత వాణి
కాల ప్రభావాలకు నిలిచే పరమాత్మ భావన విశ్వమున అవతరించి యుగాలే గడిచాయి
ఎంతటి ఆత్మ సంకల్పం ఉంటే అంతటి కాల ప్రభావాలకు ఏకత్వాన్ని జయించగలగాలి
విశ్వమున మర్మము తెలిసినా కాల ప్రభావాలతో జీవించుట మేధస్సుకు తక్షణ మర్మమే
తక్షణ మర్మాన్ని రహస్యంతో తక్షణంలో తెలుసుకుంటూ సాగాలంటే ఆత్మలో ఏకత్వమే
No comments:
Post a Comment