అలసటతో ఆలోచిస్తూ మేధస్సులో ఉత్తేజం లేక కార్యాలు సాఫీగా సాగలేకపోతున్నాయి
ఉత్తేజం లేని మేధస్సుతో శక్తి సామర్థ్యాలు తగ్గి కార్యాలలో లోపాలు కనిపిస్తున్నాయి
ఆకలి కాదు దాహం కాదు మానసిక ఆలోచనలతో అలసట చెంది ఉత్తేజం తగ్గుతున్నది
మేధస్సులో ఉత్తేజం ఉన్నంత వరకే కార్యాలలో నైపుణ్యం అనుభవాలు కనిపిస్తాయి
మేధస్సులో ఉత్తేజం లేకపోతే కాస్త విశ్రాంతి లేదా కొంత ఆహార శక్తిని తీసుకోండి
శక్తితో ఉత్తేజంగా ఆలోచిస్తూ మానసిక సమస్యలను మరచి కార్యాలతో సాఫీగా సాగండి
No comments:
Post a Comment