ఎన్నో మేధస్సులోనే చేరుతున్నాయి
ఏవేవో ఇష్టం లేనివి ఇష్టమైనవి ఎన్నెన్నో మేధస్సులో
అర్థమైనవి అర్థం కానివి గ్రహించినవి గ్రహించ లేనివి
అజ్ఞానమైనవి విజ్ఞానమైనవి తెలిసినవి తెలియనివి
ఏవి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతాయో మేధస్సుకు తోచునా
ఎవరికి ఉపయోగపడునో నేను ఎవరికి దేనిని అందించగలనో
అన్నీ కాల నిర్ణయమే లేదా నా మేధస్సు ప్రభావమే
మీకు కావలసిన భావాలు నాలో ఉంటే తెలుసుకోండి ఎలాగైనా
No comments:
Post a Comment