మేధస్సే నీ శరీరాన్ని నడిపిస్తున్నది
శరీరంలోని ప్రతి కదలికను పరిశీలిస్తున్నది
ఏ అవయవాలకు ఏ సమస్య కలిగినా తెలుసుకుంటుంది
ప్రతి కణ భావ స్వభావ స్పర్శను గమనిస్తూ గ్రహిస్తుంది
ఆకలైనా దాహం వేసినా రోగం వచ్చినా ప్రమాదం జరిగినా
శరీరంలో కలిగే ప్రతి అవస్థను మేధస్సు గ్రహిస్తూనే ఉంటుంది
మేధస్సు ఎంత ఉత్తెజమైతే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది
శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మేధస్సు అంత ఉత్తేజంగా ఉంటుంది
సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే శరీరాన్ని గొప్పగా నడిపిస్తుంది
No comments:
Post a Comment