నేటికి ఏనాటికైనా ఒక్క భావన చాలు 'మంచి జరగాలని'
ప్రపంచాన్ని మార్చాలనే ఒక్క విజ్ఞాన భావన చాలు
ప్రతి ఒక్కరు విశ్వ విజ్ఞానంతో జీవించాలనే భావన చాలు
ప్రతి జీవి ఆత్మ బంధువేనని జీవ హింస లేని భావన చాలు
ప్రతి ప్రదేశాన్ని శుభ్రతగా ఉంచాలనే ఒక్క భావన చాలు
ప్రతి మనిషిలో మంచి అలవాట్లే ఉండాలనే భావన చాలు
ప్రతి ప్రణాళిక క్రమ కార్య కారణ విధానంతో జారగాలనే భావన చాలు
ప్రతి మనిషిలో సత్యమేవ జయతే అనే భావన చాలు
ప్రతి జీవికి మంచి జరగాలనే భావన చాలు
ప్రతి వస్తువును సద్వినియోగం చేసుకోవాలనే భావన చాలు
మీలో ఒక్క హిత భావన ఉంటే చాలు విశ్వ సమాజం సస్యశామలమే
హిత భావనను సంకల్పంతో సమాజానికి విజ్ఞానంగా తెలియజేయండి
No comments:
Post a Comment