చల్లని సూర్యోదయ కిరణాల ప్రకృతిలో ధ్యానించు
నీ శరీరంలో ఆత్మ పొందే విశ్వ తత్వ భావాలు అమృతం
ఓ వైపు శరీరం చలి కాచుకున్నట్లు ఆత్మ ఉత్తేజమైనట్లు
ఆత్మ ఉత్తేజంలో కలిగే విశ్వ రూప భావ స్వభావాలు దైవత్వమే
దైవత్వ భావాలతో దేహం హిమములా విశ్వ పర్వతమవుతుంది
విశ్వ పర్వతమే కైలాస శిఖరమై మహా ధ్యానంతో ఆత్మ ప్రకాశిస్తుంది
No comments:
Post a Comment