Saturday, December 18, 2010

సూర్య తేజస్సును చూసిన మొదటి జీవి

సూర్య తేజస్సును చూసిన మొదటి జీవి నేత్ర భావన ఎటువంటిది
కన్నులలో దాగిన కాంతి భావన మేధస్సుకు తెలియని స్వభావమే
సూక్ష్మజీవిగా సూర్య తేజస్సును ఒక్కసారిగా మొదటిసారి చూడుటలో
విశ్వాన్ని ఒక్కసారి విశ్వపు ధ్యాసలో చూసినట్లుగా భ్రమింపజేసిందేమో
ఆత్మ పరమాత్మను దర్శించటం ఇలాంటి సూర్య తేజ నేత్ర భావనయే
ఆనాడు సూక్ష్మ జీవిగా విశ్వాన్ని దర్శించుటలో ఎన్నో భావాలు నా మేధస్సులోనే
తన శరీర నిర్మాణ విశిష్టత అవయవాలు కదలికలు స్వభావాలు ఎన్నో అనంతమే
మేధస్సు ఎరుగని రీతిలో భావనకు తెలియని ధ్యాసలో ఆలోచన ఉదయించని కాలం
విశ్వాన్ని చూస్తూ ఉంటే తన చలనానికి తనకు తెలియని స్పందనగా కదులుతున్నది
ఆకలి భావాలు తక్కువ మేధస్సు స్వభావాల ఎరుక లేక ఇంకా ఏమీ తెలియని శూన్యంలా
విశ్వం ఎంత దూర ప్రయాణమో ఏది ఎక్కడ ఉందో ఎందుకు ఎలా ఎప్పుడు వెళ్ళాలో
విశ్వం ఎప్పుడు చీకటవుతుందో ఎంతకాలమో మరలా వెలుగుతో ఎందుకు సాగుతుందో
ఆహారం ఏదో కనిపిస్తున్నవన్నీ ఎందుకో ఎవరు కనిపించుటలేదే ఎంత కాలం ఇలా
మరో జీవి ఉందన్న భావన విజ్ఞానం లేదు ఆలోచనగా ఏమీ తెలుసుకోవాలని లేదు
మనస్సు మాత్రం భవిష్య కాలానికి వెళ్ళుతూ శక్తి నశిస్తున్నట్లు ఆకలి భావన ఏర్పడుతున్నది
ఆనాడు సూక్ష్మజీవిగా ఏ పదార్ధం నుండి జన్మించినదో తల్లి భావన కలిగించిన విస్వార్థం ఏదో
ఆనాడు మొదటి జీవి ఒంటరిగా జన్మించినదా తోడుగా ఇంకో జీవి కలిసిందా కనిపించిందా
ఒంటరిగా జీవించి ఒంటరిగా మరణించి ఉంటే మరో జీవి ఎప్పుడు ఎలా ఎక్కడ ఉదయించింది
మేధస్సులో ఎన్ని భావాలో విశ్వ కార్య క్రమ విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తాయిలే నాలో

No comments:

Post a Comment