Saturday, December 18, 2010

వైకుంఠ ఏకాదశికి కర్మలు ఆగిపోతాయే

వైకుంఠ ఏకాదశికి కర్మలు ఆగిపోతాయే గాని తొలగిపోవు
పవిత్రమైన రోజులలో కొన్ని దైవ ప్రభావాలు అల్లుకుంటాయి
దైవ ప్రభావాలకు కర్మలు శాంతిస్తూ కొన్ని కార్యాలను నడిపిస్తాయి
ఏనాటి నుండో కార్యాలు సాగలేక అడ్డంకులు కలుగుతుంటే
వైకుంఠ ఏకాదశికి కొంత వరకు జరిగేలా దైవ ప్రభావాలతో సాగుతాయి
మళ్ళీ ఆ కార్యాలను ఇంకాస్త ముందుకు నడిపించేందుకు కొత్త అడ్డంకులు
కొత్త సమస్యలతో కర్మలు సాగుతూ కార్యాలను బలహీనంగా నడిపిస్తాయి
సమస్యల కార్యాలను దైవ భావాలతో విశ్వ విజ్ఞానంతో కొనసాగించాలి
కర్మలను ఆత్మలో శూన్యం చేసుకొని దైవ ప్రభావాలతో కార్యాలను సాగించాలి
కర్మలను శూన్యం చేసుకొనుటకు విశ్వ కాల ఆత్మ భావాలను శ్వాసతో గమనించాలి

No comments:

Post a Comment