ఈ భావాలు ఏ గమ్యాన్ని చేరుకుంటాయో విశ్వ భాషకే తెలుసు
విశ్వంలో ఏ అంచులను తాకుతూ ఏ రూపాలలో ఉండిపోతాయో
విశ్వమంతా నా భావాలు అణువులుగా వివిధ స్వభావాలతో తిరుగుతూనే
ఏ భావం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో నా మేధస్సునకే మహా ఎరుక
జీవుల మేధస్సులలో కలిగే భావాలు నా స్వభావాలేనని విశ్వానికే ఎరుక
భావాలను నా భావనతో సృష్టించి వివిధ స్వభావాలుగా విశ్వమున కలిగించా
ఈ భావాలే నాకు జీవమై శ్వాసలో చేరి విశ్వ స్వభావాలను తెలుపుతున్నాయి
No comments:
Post a Comment