నా అన్వేషణలో ఎక్కడో కొన్ని వేల యుగాల నాటి నుండి ఓ భావన నాకై వస్తున్నది
నక్షత్రాల కాలం కన్నా ముందే ఉదయించిన ఆ భావన నా మహా ఎరుకనే మేల్కొల్పింది
విశ్వం ఉద్భవించక ముందే ఒంటరిగా తనకు తానే తెలియని మర్మ ధ్యాసలో భావనైనది
ఎన్ని విధాల తెలిపినా విశ్వ మూల ఆది భావన నా మేధస్సులో దివ్యమై చేరినది
No comments:
Post a Comment