Thursday, February 27, 2020

మరణమా నీవు క్షేమమా

మరణమా నీవు క్షేమమా
మరణమా నీవు మోక్షమా

మరణమా నీవు శుభమా
మరణమా నీవు లయమా 

నీవు లేని జీవితం సాగుతున్న విరహ ప్రయాణం
నీవు లేని జీవనం ఒదుగుతున్న ప్రయాస చలనం  || మరణమా ||

మనస్సుతో నీవు శాంతమా
దేహస్సుతో నీవు శూన్యమా
 
రూపముతో నీవు దివ్యమా 
జీవముతో నీవు మాయమా

మేధస్సుతో నీవు మంత్రమా
వయస్సుతో నీవు తంత్రమా

జ్ఞానముతో నీవు విరామమా
వేదముతో నీవు సంపూర్ణమా  || మరణమా ||

కాలముతో నీవు కాంతమా
కార్యముతో నీవు ధ్యానమా

స్నేహముతో నీవు ధీరమా 
ప్రేమముతో నీవు భవ్యమా

నాదముతో నీవు భావమా
హితముతో నీవు తత్వమా

సరస్సుతో నీవు శుద్ధమా
ఉషస్సుతో నీవు మౌనమా (నిశబ్దమా)  || మరణమా || 

No comments:

Post a Comment