విశ్వ సుందరివో విశ్వసించవా
విశ్వ భావానివో విస్మయించవా
విశ్వ రూపానివో వరించవా
విశ్వ బంధానివో విస్తరించవా
విశ్వ ప్రభాతవో వర్తించవా
విశ్వ తత్వానివో వ్యాపించవా
విశ్వానికే జగదేక సుందరివై అతిలోక యువతివై నిలిచెదవా || విశ్వ ||
వలపుల తేనెల పుష్ప పత్రాలతో నవ గంధాలనే వికసించవా
వయ్యారాల వెన్నెల దివ్య కాంతులతో జీవ వర్ణాలనే విశదించవా
హృదయ సౌందర్యాలతో శృంగార రమణీయతనే పులకించవా
ఉదయ సౌభాగ్యాలతో పారిజాత పరిమళాలనే ప్రతిబింబించవా || విశ్వ ||
పత్రహరితముల పర్యావరణముచే ప్రభాతమై పరిశుద్ధంతో ప్రకాశించవా
సత్యచరితముల సంభాషణలచే సంభూతమై పరిపూర్ణతో ప్రభవించవా
నిత్య గమనముల జ్ఞానాధారణచే పరిశోధనమై ప్రసిద్ధతతో ప్రఖ్యాతించవా
సర్వ స్మరణముల విద్యాధారణచే పరిశీలనమై ప్రావీణ్యతతో ప్రదర్శించవా || విశ్వ ||

No comments:
Post a Comment