Tuesday, February 4, 2020

వేదమే మంత్రమా జీవమే తంత్రమా

వేదమే మంత్రమా జీవమే తంత్రమా
దేహమే యంత్రమా జ్ఞానమే మర్మమా

మనస్సుతో సంధానమా వయస్సుతో సంబంధమా
మేధస్సుతో విజ్ఞానమా ఆయుస్సుతో ప్రయాణమా

జీవించుటలో అనుభవమే అభ్యాస యోగమా  || వేదమే ||

జీవనం ఒక మహా అక్షరం జీవితం ఒక ధ్యాన అభ్యాసం
గమనం ఒక లయ ఏకాంతం చలనం ఒక ధ్యాస ఏకీకృతం

భావనం ఒక మంత్ర స్మరణం తత్వనం ఒక తంత్ర భ్రమణం
వదనం ఒక యంత్ర విశేషణం వచనం ఒక మర్మ సంభాషణం

తరుణం ఒక ముఖ్య స్థానికం సమయం ఒక మహా ప్రదేశం
వరుణం ఒక శ్రేష్ఠిత సాగరం ధారణం ఒక ప్రధాన స్థావరం  || వేదమే ||

ప్రణామం ఒక మంత్ర ఉదయం ప్రశాంతం ఒక తంత్ర జననం
ప్రయోగం ఒక యంత్ర యాగం ప్రయత్నం ఒక మర్మ కల్పనం

భూషణం ఒక రీతి నియమం భాషణం ఒక వైన పరిచయం
వేషణం ఒక అచ్చు శ్రామికం మరణం ఒక భావ సిద్ధాంతం

కారణం ఒక కార్య శాస్త్రీయం భరణం ఒక జీవ శ్రమణం
కథనం ఒక వేద సారాంశం స్మరణం ఒక జ్ఞాన తపనం  || వేదమే || 

No comments:

Post a Comment