హిత శత్రువును విడిపించవా ప్రభూ
అహిత శత్రువును తొలగించవా ప్రభూ
ఉత్తమ స్నేహితున్ని సమీపించవా ప్రభూ
సహిత స్నేహితున్ని ఆశ్రయించవా ప్రభూ
(సర్వోత్తమ గుణములను అనుకరించవా ప్రభూ)
సర్వోత్తమ గుణములను మహా కార్య సిద్ధికై ద్యుతితో అనుకరించవా ప్రభూ || హిత ||
సుహితములే విచక్షణ భావాలకు సోపాన వేదములు
సుహితములే ఇంద్రియ తత్వాలకు సాధన చరణములు
సుహితములే అహింస భావాలను తొలిగించు సుబోధములు
సుహితములే అధర్మ తత్వాలను వదిలించు సుగుణములు
సుహితములే విజ్ఞాన జీవన విధాన ఆచరణకు ఆధారములు
సుహితములే విశిష్ట జీవిత వైఖరి సాంప్రదాయానికి ఆదర్శములు || హిత ||
సుహితములే సుగుణ సంబంధాలకు సుదీర్ఘ ప్రవచనములు
సుహితములే సుగంధ పరిమళాలకు సువర్ణ సుభాషితములు
సుహితములే అపార విఘాతాలను తొలగించు అస్త్రములు
సుహితములే అనంత విషాదాలను వదిలించు అర్థములు
సుహితములే పర్యావరణ పరిశుద్ధ ప్రకృతి వృద్ధ ప్రమాణాలు
సుహితములే పత్రహరిత పరిమాణ ప్రకృతి సిద్ధ ప్రమేయాలు || హిత ||

No comments:
Post a Comment