Friday, February 7, 2020

అచల చంచల రూపం

అచల చంచల రూపం
అచల సంచల తత్వం

అదర గంభీర వచనం
అదర మంజీర వదనం

మదన మోహన భావం
మదన మాన్యత దేహం  || అచల ||

మధుర మకుట భూషణం
మధుర మందార భవితం

విశ్వ మానస మనోహరం
విశ్వ మాత్రిక మర్మత్రయం

జీవ విజ్ఞాన గమనం
జీవ ప్రమాణ చలనం   || అచల ||

జగతి సుందర తిలకం
జగతి సింధూర వాలకం

తరుణ తన్మయ తపనం
తరుణ తస్మయ తలచం

సమయ సందర్భ సదరం
సమయ సందర్శ సద్భావం  || అచల || 

No comments:

Post a Comment