సూర్యునిలో ప్రతి కిరణం ఓ వర్ణ భావనను తెలుపుతుంది
మొదటి లేత కిరణాలు పూల వర్ణాల రంగులను తెలుపుతాయి
ఆ తర్వాత విశ్వాన్ని తాకే కిరణాలు సువర్ణాల తేజస్సును కాంక్షిస్తాయి
తద్వారా వజ్ర వైడూర్య భావాలతో నక్షత్ర కాంతులు విశ్వమంతా విస్తరిస్తాయి
మేఘాలను మెరిసేలా చేస్తూ వివిధ వర్ణ ఛాయ రూపాలను చూపించును
ఆకాశంలో ప్రతి వర్ణాన్ని మేఘాల ఆకృతులతో ప్రతి రోజు చూపిస్తూనే ఉంటుంది
No comments:
Post a Comment