Wednesday, December 8, 2010

ఒక జీవ కణంలోనే ఎన్నో రూపాలు

ఒక జీవ కణంలోనే ఎన్నో రూపాలు ఉన్నాయి
జీవ కణం జీవించుటలో ఎన్నో అవయవాలు ఎదుగుతాయి
అస్థికలు కండరాలు నరాలు శ్వాస కోశ ప్రేగులు
మేధస్సు జ్ఞానేంద్రియాలు జీర్ణ వ్యవస్థ అంగ భాగాలు
శిరస్సు దేహము చేతులు కాళ్ళు ఇలా ఎన్నో విశ్వ జీవుల కణాలలో
తల్లి గర్భంలో పెరిగే జీవ కణమే అన్ని అవయవాలతో ఎదుగుతుంది
ఓ జీవ కణం ఓ జీవ రూపానికి నిదర్శనం
జీవ కణం ఎదిగేందుకు తల్లి శక్తిని స్థానాన్ని భావనను ఇస్తుంది
దంతాలు మాత్రం జన్మించిన తర్వాతనే ఎదుగుతాయి
ఆనాడు ఉదయించిన విశ్వ కణం నా భావనలో స్థానమై శక్తిగా ఉదయించింది
నేడు మనం చూసే విశ్వ రూపాలన్నీ ఇలా ఎదిగినవే
విశ్వ రూపాలు పంచ భూతాల నిర్మితమైనా ఎన్నో మహా రూపాలు ఉన్నాయి
పర్వతాలు ఖండాలు దీవులు అడవులు సముద్రాలు ఎడారులు భూమి
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇలా ఎన్నో అద్భుతమైన రూపాలు
అన్నీ విశ్వ ఆత్మ జీవ కణం నుండి కాలంతో ఉద్భవించినవే

No comments:

Post a Comment