Wednesday, December 8, 2010

ప్రతి క్షణం ప్రతి జీవి మేధస్సులో ఎన్నో

ప్రతి క్షణం ప్రతి జీవి మేధస్సులో ఎన్నో భావాలు కలుగుతుంటాయి వెళ్ళిపోతుంటాయి
మనకు కావలసిన భావాలను మనం ఆలోచనలుగా గ్రహిస్తూ కొంత కాలం సాగుతాం
మనకు తెలియని తోచని భావాలు కూడా ఎన్నో ఎందరి మేధస్సులలో కలుగుతుంటాయి
పుస్తక గ్రంధాలను సమాచార దూరవాణి కేంద్రాల నుండి ఎన్నో భావాలను గ్రహించవచ్చు
విజ్ఞానంగా ఎదుగుటలో ఎలా అవకాశం వచ్చినా అలా ఎన్నో భావాలను గ్రహిస్తుంటాము
కొన్ని సాధించాలంటే కొన్నిటిని శ్రమిస్తూ ప్రయాణిస్తూ అన్వేషణతో ఎందరితో తెలుసుకోవాలి
విజ్ఞానానికి అంతం లేదు జీవితాన్ని మార్చే భావాల కోసం తపిస్తూ కాలంతో సాగిపోవాలి

No comments:

Post a Comment