మరణించేటప్పుడు భాద కలుగుతున్నా మరణించిన తర్వాత ఆనందమే
మరణించుటతో మేధస్సుకు ఏ కార్యాలు లేక ఏ అజ్ఞానం లేక సుఖాంతమే
శరీరం నశించుటచే ఆ జన్మ కర్మ ఆగిపోవును అనారోగ్యం తొలగిపోవును
వివిధ కార్యాల ఆశల ఆవేదనలు అసంతృప్తి గ్రహ స్థితి అన్నీ తొలగిపోవును
మరణించుటచే ఆత్మగా మరో జన్మ ఉన్నా కొత్త భావాలతో జీవితం ఆరంభమే
కొత్త జన్మతో జీవించుటలో మరో కొత్త ఉత్తేజం మేధస్సులో కలుగుతూ సాగుతుంది
మరల శరీరంలో దుఃఖం ఏర్పడితే శరీరం చాలించాలని మరణంకై ఎదురు చూపే
No comments:
Post a Comment