జీవ హింసలో పరమ హంస కనిపించిన కొన్ని సందర్భాలలో చేయవలసి వస్తుంది
మాంసాహారాన్ని భుజించకుండా ఉండగలం ఐనా మరో విధంగా హింస చేస్తున్నాం
దోమలను చీమలను పాములు తేళ్ళు కాళ్ళ జెర్రిలను పంట పొలాలలో పురుగులను
ఇలా ఎన్నో చంపుతూనే మనకు హాని కలగకుండా రక్షించు కుంటున్నాము
ఒక విధంగా భయం మరో విధంగా కీడు కలుగుతుందేమోనని హింసిస్తున్నాము
అనారోగ్యము కలుగుతుందేమోనని ప్రాణాలు పోతాయేమోనని ఎన్నిటినో హింసిస్తున్నాం
ఒక జీవిని అనవసరంగా హింసించరాదనే విజ్ఞానంగా పరమ హంసను తెలుసుకోండి
No comments:
Post a Comment