నీవు చంపాలనుకున్నది ఒకరైతే నీవు పేల్చివేసిన ప్రమాదంలో నీ ఆత్మీయులు వందలలో చనిపోయారు -
నీకు ఒకరు తెలిపితే నీకు ఇష్టం లేకున్నా వారి ప్రమేయంతో ఒకరిని చంపాలని ఆవేదన అలజడి చెందుతున్నావు -
ఇష్టం లేని కార్యమైనా విధి నిర్వాహణలో చిక్కిపోయి ప్రతి రోజు పర ధ్యాసలో ఆలోచిస్తూ జీవితాన్ని సాగిస్తున్నావు -
అనుకున్న వ్యక్తి చనిపోలేక వందలలో చనిపోయిన వారి స్థితి వారి కుటుంబ జీవితాలు నేటి నుండి ఎలా గడ్తుస్తాయి -
వివిధ ప్రమాదాలకు గురైన వారు కాళ్ళు చేతులు ముఖ ఛాయలు ఎన్నో విధాల గాయపడిన వారి జీవితం ఏమిటి -
చంపే వరకు నీలో ఓ గురి ఉంటుంది ఆ తర్వాత నీకు తెలుస్తుంది కర్మ ఎంతటిదో జీవితాన్ని రుచించలేకపోతావు -
తల్లి తండ్రి సోదరులు గురువులు స్నేహితులు నీతి సత్య ధర్మ విశ్వ విజ్ఞానం ఏదీ తెలియనివాడిగా చంపాలనుకున్నావు -
మానవుడిగా మరో మానవున్ని చంపడం ఆత్మ హత్య కన్నా మహా పాపం కర్మ సిద్ధాంతంలోనే మహా ఘోర శిక్షణ -
నీకు నీవుగా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా విశ్వ విజ్ఞానిగా జీవించాలని శ్వాసపై ధ్యాసతో ధ్యానిస్తూ యోగిలా సాగిపో -
No comments:
Post a Comment