Wednesday, December 1, 2010

ప్రతి జీవికి తెలుసు ఎలా జీవించాలో

ప్రతి జీవికి తెలుసు ఎలా జీవించాలో ఎదుగుటలో నేర్చుకుంటుంది
ఎన్నింటినో తెలుసుకుంటు గమనిస్తూ కాలంతో జీవిస్తూ సాగుతుంది
ఎక్కడ ప్రయాణించాలి ఏ ఆహారం భుజించాలి ఏ కార్యాలు చేయాలి
ఎవరితో జీవించాలి వేటిని తెలుసుకోవాలి దేనిని గుర్తించుకోవాలి
ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఎంత సమయం ఎక్కడ కేటాయించాలి
జీవిస్తూ ఎదుగుటలో ప్రతి జీవికి తెలుసు తమ జీవన జీవితాలు
ఎన్ని తెలిసినా కొన్ని సందర్భాలలో పొరపాట్లు జరుగుతుంటాయి
కాలం కూడా ఎన్నో ప్రభావాలను సమస్యలతో అజ్ఞానాన్ని కలిగిస్తుంది

No comments:

Post a Comment