ఏ స్వభావం లేకుండా ఎటువంటి భావన కలగదు
స్వభావం కలగాలంటే ఎటువంటి అణువైనా ఆత్మ తత్వంతో స్పందించాలి
స్పందన కాలంతో కలిగే వివిధ ఋతు పవనాల ప్రభావాల మార్పులే
ప్రకృతి ప్రభావాలతో కలిగే మార్పులు కూడా కొన్ని అణువులకు స్పందనయే
ఆత్మతో తత్వం తత్వంలో స్పందన స్పందనలో స్వభావం స్వభావంతో భావన
భావనతో మార్పు చెందుతూ ఎన్నో అణువులు ఎన్నో రకాలుగా జీవిస్తున్నాయి
జనన మరణాలు కూడా భావ స్వభావాల ఆత్మ తత్వ స్పందన గుణా స్పర్శలే
No comments:
Post a Comment