Saturday, December 11, 2010

నగర వాహనాలలో ప్రయాణించుట

నగర వాహనాలలో ప్రయాణించుట శోచనీయమే అనారోగ్య సమాజ దుస్థితియే
రక్తంతో తడిసిన వారు మద్యంతో తడిసిన వారు రసాయనాలతో తడిసిన వారు
ఇంధనాలతో తడిసిన వారు వర్షానికి తడిసిన వారు చమటతో తడిసిన వారు
మలినములతో తడిసిన వారు ఎందరో ఎన్నో రకాలుగా తడిసిన వారే
దురలవాట్లతో నోటిలో చేతులలో అశుభ్రతయే అజ్ఞాన దుర్వాసనలే
మేధస్సును అజ్ఞాన పరిచేవి మతి స్థిమితాన్ని కలిగించేవి ఎన్నో విధాల ఇవే
రద్దీగా ఉన్న వాహనాలలో ఎవరు దేనిని దొంగాలిస్తారో ఎవరు ఎలాంటివారో
ప్రయాణించుటకు వీలు కానంతగా అజ్ఞాన మాటలతో అర్థం కాని స్థితులతో
విశ్వమున ఎలాంటి రహదాలు ఎన్నో విధాల ఎన్ని నిర్మించినా ప్రయాణం అవస్థయే
జన సంఖ్య తగ్గే వరకు సమాజంలో ఇలాంటివి అనంతమేనని నా మేధస్సులో ఎప్పటి నుండో
ముఖ్య మంత్రులు ప్రధాన మంత్రులు నగర వాహనాలలో తిరిగితే దేశ భవిష్యత్ సువర్ణమే

No comments:

Post a Comment