విశ్వమున నడి మధ్యలో నిలిచే అన్ని దిక్కులను చూస్తున్నా
సూర్యుడు ఉదయించే వేళ తూర్పున అస్తమించే వేళ పడమరన
ప్రతి నక్షత్రం దిక్కున చూస్తూ చంద్రుని దిక్కులను చూస్తున్నా
సూర్య కిరణాలతో మెరిసే మేఘ రూప వర్ణ ప్రభావాలను చూస్తున్నా
మెరిసే ఉరుములను రాలిపోయే పిడుగులను చూస్తూనే ఉన్నా
పొంగే అగ్ని లావా జ్వాలలు భూ ప్రకంపనాలను చూస్తున్నా
సముద్రపు అలలు జల ప్రకంపనాలు సుడి గుండాలను చూస్తున్నా
వాయు వేగాలను జలపాత సెలయేరులను చూస్తూనే ఉన్నా
పక్షులు విహరించే దిక్కులను చూస్తూ ఆకాశమంతా తిలకిస్తున్నా
భూమిపై చలించే జీవ రాసులను మెరిసే రూపాలను చూస్తున్నా
ప్రతి అణువును చూస్తూనే విశ్వం నడి మధ్యలో నిలిచిపోయా
చూడని ప్రదేశము లేదు వర్ణ భావన లేదు కాంతి తేజస్సులు లేవు
ఆనాటి నుండి ప్రతీది అన్ని కోణాల దిక్కులను చూస్తూ నిలిచిపోయా
No comments:
Post a Comment