తెలిసినా తెలుసుకో తెలియనిది నేర్చుకో మిత్రమా!
నిత్యం ఏదైనా తెలుసుకో తెలియనిది ఎంతైనా నేర్చుకో
తెలుసుకుంటూనే ఆచరణ చేసుకో తెలియకపోతే ఆగమన చేసుకో
తెలుసుకుంటూనే అధ్యాయం చేసుకో తెలియకపోతే సాధన చేసుకో
తెలియని విషయాలనే పాఠ్యాంశాలుగా విచారిస్తూ అవగాహనతో వివరణ చేసుకో || తెలిసినా ||
మరచిపోలేని విధంగా ముఖ్యాంశాలను ఏకాగ్రతతో మననం చేసుకో
మరచిపోలేని విధంగా ప్రత్యేకాంశాలను ఎరుకతో అధ్యాయనం చేసుకో
తెలిసిన విధంలోనే మరచిపోయే వాటిని స్వధ్యాసతో జ్ఞాపకం చేసుకో
తెలిసిన మార్గంలోనే తెలియని వాటిని స్వధ్యానంతో స్మరణం చేసుకో || తెలిసినా ||
తెలిసినదంతా ఇతరులకు క్లుప్తంగా తెలిపేలా నీలోనే ప్రణాళిక చేసుకో
తెలిసినదంతా ఇతరులకు విశేషంగా తెలిపేలా నీలోనే పరిశోధన చేసుకో
తెలిసినదంతా ఎందరికో తెలిసేలా నీవే అభివృద్ధిని సాధించేలా చేసుకో
తెలిసినదంతా ఎందరికో తెలిసేలా నీవే పురోగతిని మెప్పించేలా చేసుకో || తెలిసినా ||

No comments:
Post a Comment