Monday, October 21, 2019

జగమంతా ఆత్మ రక్షణ నాదే

జగమంతా ఆత్మ రక్షణ నాదే
విశ్వమంతా జీవ చింతన నాదే
లోకమంతా శ్వాస ధ్యాసన నాదే

నా దేహమంతా విశ్వ జీవుల సురక్షిత భావ పరిశోధనమే
నా మేధస్సంతా విశ్వ జీవుల సుఖాంత తత్వ అన్వేషణమే

నా జీవమంతా విశ్వ జీవుల పరిశుద్ద విజ్ఞాన జీవన సుగుణాల ఆచరణమే  || జగమంతా ||

ప్రతి జీవిలో శ్వాసనై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో అమృతమై ధ్యానిస్తున్నా
ప్రతి జీవిలో ధ్యాసనై స్వభావత్వాల స్వచ్ఛతలతో ఆచరణమై తపిస్తున్నా

ప్రతి జీవిలో ఆత్మనై వేదాంత విజ్ఞానాన్నే చాతుర్యమై పరిశోధిస్తున్నా
ప్రతి జీవిలో ధాతనై విశ్వాంత సిద్ధాంతాన్నే ప్రావీణ్యమై అన్వేషిస్తున్నా  || జగమంతా ||

ప్రతి జీవిలో వేదమై అనంత అపూర్వ ఆధునిక సత్యాలనే స్మరిస్తున్నా
ప్రతి జీవిలో జ్ఞానమై అసంఖ్య అభిన్న ఆద్యంత దైవాలనే ఆస్వాదిస్తున్నా

ప్రతి జీవిలో భావమై ఉజ్జ్వల భవిష్య ప్రకృతి శాస్త్రాలనే పరిశోధిస్తున్నా
ప్రతి జీవిలో తత్వమై ఉన్నత అద్భుత ప్రకృతి సిద్ధాంతాలనే అన్వేషిస్తున్నా  || జగమంతా || 

No comments:

Post a Comment