ఆచార వ్యవహారాలలో సంతృప్తి కలగలేదంటే
మానసిక విశ్వ ప్రశాంతతకై ధ్యానించండి
ఏకాగ్రత ధ్యాసతో శ్వాసను సూక్ష్మంగా గమనిస్తే
మీలో కదలిక లేక మనస్సు ఆలోచనలను వదిలి
ఆత్మ పై కేంద్రీకృతమై విశ్వశక్తి మీలో ప్రవేశిస్తుంది
తద్వారా మీలోని అనారోగ్యం నశించి సద్గుణాలు కలుగుతాయి
ఆపై విశ్వ భావ స్వభావాలు మీ మేధస్సును విజ్ఞానపరుస్తాయి
విశ్వ విజ్ఞానంతో ఆత్మ ప్రశాంతతను పొంది ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తారు
విశ్వ చైతన్యంతో విశ్వ కార్యాలతో ప్రశాంతంగా జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment