ఓ మహా గ్రహంపై విశ్వ భావనతో కూర్చొని ధ్యానిస్తుంటే
ఆ గ్రహ భ్రమణ వేగానికి గ్రహమే కనిపించని విధంగా ఉన్నది
అంతటి వేగములో నా శరీరము సూక్ష్మమై శూన్యమైనది
శరీరము శూన్యమైనా భావన మాత్రం తటస్థంగా నిలిచింది
విశ్వ భావన లేకపోతే గ్రహముపై నిలిచే శక్తి ఎవరికీ లేదు
గ్రహము భ్రమణంతో ప్రయాణించినా తటస్థంగా నిలువగలను
ఏ వేగానికైనా విశ్వ భావనతో నిలిచే వాడిని నేనే
బంతివలె గ్రహము ఎలా ఏ కోణంలో తిరుగుతూ ప్రయాణించినా
నేను గ్రహము పై భాగముననే కూర్చొని ధ్యానిస్తూ ఉంటా
నాలాగే మీలో విశ్వ భావన తటస్థంగా నిలవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment