ఆధ్యాత్మ జీవితం కావాలి ప్రభూ! ..... నాకు నీవే శరణ్యం
నా జీవితం సుడి గుండాలతో నిండిపోయి నేను మునిగిపోతున్నా
నాసికము తేలుటతో శ్వాస తీసుకుంటున్నా లేదంటే మరణమే
మరణాన్ని జయించిన నాసికమునందే అమృత శ్వాస ఉన్నది
శ్వాస నీయందునే ఉంటే నేనెలా ఆధ్యాత్మ జీవితాన్ని ఇవ్వగలను
నీ శ్వాసతో నీవే గమనిస్తూ ధ్యానిస్తే ఆధ్యాత్మ జీవితం ఆరంభమగునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment