Sunday, July 18, 2010

కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని

కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని సూచిస్తుందని నేను తెలుపుటలో
మేధస్సు ఆలోచించే విధానానికి కార్యము చక్కగా జరగకపోవటమే
మేధస్సుకు కార్య కారణ శాస్త్రము ప్రతి కార్యమునకు తెలియకనే
చాలా కార్యములలో కొన్ని సూక్ష్మ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి
పొరపాట్ల వల్ల సమయం వృధా అవుతూ ఎన్నో రకాల ఇబ్బందులు
ఒక పనిలో జరిగే పొరపాటు వల్ల ఇంకో అనవసరమైన పని కలగరాదు
అనవసరమైన పనులతో మానసికంగా ఆర్థికంగా కాస్త కష్ట నష్టాలే
కార్య కారణ శాస్త్రమేంటే ఓ పనిని సూటిగా లోపం లేకుండా చేయడమే
సూటిగా చేయడానికి మేధస్సులో ఓ అవగాన ఆలోచన విధానం కలగాలి
ప్రతి కార్యాన్ని పరిశీలిస్తూ ఏకాగ్రతతో చేస్తే కార్య కారణం తెలుస్తుంది
జీవితంలో ఎదురయ్యే పొరపాట్లను అవగాహన చేస్తూ కారణాన్ని గుర్తించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment