Saturday, July 17, 2010

ధ్యానించుటలో ఏకాగ్రత కలగకపోతే

ధ్యానించుటలో ఏకాగ్రత కలగకపోతే ఆలోచనలు ఎక్కువైతే
ఒక ఆలోచనను ధృడ సంకల్ప భావంతో మేధస్సున వదలండి
అంతా మంచే జరుగుతుంది అందరూ క్షేమంగా ఉంటారని వదిలి
కొంత కాలం శ్వాసను గమనిస్తే ఆ తర్వాత నా కార్యాలలో నిమగ్నమవుతా
నా కార్యాలలో విజ్ఞాన సామర్థ్యాన్ని పొందుటకే శ్వాస గమన ధ్యానం
అవసరమైన పనులను ముగించి ప్రశాంతంగా విశ్వ భావనతో కూర్చోండి
కొన్ని రోజులకు ఆలోచన స్థితి సరిలేకపోతే వివిధ సిద్ధాంతాలతో చేయండి
స్నానం చేసిన వెంటనే కూర్చుంటే కొన్ని రోజులకు ఓ మహా మార్పు కలగవచ్చు
ప్రశాంతమైన వాతావరణంలో తగిన సమయాన ధ్యానిస్తే ఓ విధమైన మార్పు
విజ్ఞాన సంగీతాన్ని మిత ధ్వనితో వింటూ ధ్యానిచంవచ్చు
నిద్రలో మెళకువ వచ్చిన నిద్ర నుండి లేచిన నిద్రపోయే ముందైనా కొంత ధ్యానమే
ధ్యానమున శ్వాసను గమనిస్తూ మనల్ని మనం మరచిపోవడమే కొంత కాలంగా
సాధన పెరిగే కొద్ది ఎంత సమయం ధ్యానిస్తున్నా ఎరుకతోనే మెళకువగా ఉంటాము
ధ్యానమున మనకు తెలియని ధ్యాసలో విశ్వ స్థితితో కలిగేదే ఆత్మ విజ్ఞాన భోధన
ఆత్మ భోదనలో జరిగిన విధానాన్ని తెలుసుకొనుటకు విశ్వ విజ్ఞాన ఆకాశ ప్రయాణమే -
ఆకాశాన్ని చూస్తూ సూక్ష్మ ఆలోచన విధానంతో అన్వేషిస్తే ఎన్నో విజ్ఞాన ఆలోచనలు
ఆలోచనను విజ్ఞానంగా గ్రహించే విధానం మనలో ఉంటేనే విశ్వ సందేశం అర్థమగును
సూర్యోదయ సూర్యాస్తమ చంద్రోదయ చంద్రాస్తామయ నక్షత్ర మేఘాల రూప వర్ణాలను
పక్షుల విహార వరసలను గాలి స్వభావాన్ని శ్వాస ధ్యాసతో వీలైనప్పుడల్లా తిలకించండి -
అర్థం కాని భావనలు మీలో ఏవైనా ఉంటే నా భావాలను చదువుతూ గ్రహించండి
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment