నా జన్మ కారణము తెలియక నా జీవిత అర్థం కూడా తెలియకున్నది
కార్య కారణ శాస్త్రము వలె నా జన్మ కారణము ఓ మర్మ రహస్యమే
నా మరణంతో నా జీవిత ఆశయం వ్యర్థమైతే కారణము సరికాదనా
నా ఆశయానికై మరల మరో జన్మ నాకు విధిగా కలుగుతుందా
నేటి జన్మలో పొందిన విశ్వ విజ్ఞానాన్ని మరల తిరిగి పొందాలా
ఆశయం వద్దు జీవితం వద్దు మరో జన్మ వద్దు విశ్వ విజ్ఞానం వద్దు
శూన్యములో చైతన్యమైతే చాలు నా జన్మ నాకు సార్థకమేనని భావిస్తా
మీ జీవితాలు ఏమిటో ఎందుకో తెలుసుకోవాలని కారణమునకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment