మౌనంతో మనస్సునే మార్చుకో
మాటల్లో లేనిది మౌనమున తెలుసుకో జీవితాన్ని మార్చుకో
మౌనంలో విజ్ఞానాన్ని గ్రహించేది మేధస్సా లేదా మనస్సా
మేధస్సు గ్రహిస్తే మనస్సు కూడా శ్వాసలో లీనమే
మనస్సు గ్రహిస్తే మేధస్సు ఆలోచనలో ఏకమవుతుంది
మౌనంలో అన్నీ ఏకమైతే ఆత్మ ఎరుకలో విజ్ఞానం కలుగుతుంది
ఆత్మ ఎరుక విజ్ఞానం చెందాలంటే ప్రశాంతమైన ఏకాగ్రతయే
ఆత్మ ధ్యానిస్తేనే ప్రశాంతమైన ఏకాగ్రతతో విజ్ఞానం చెందుతుంది
మౌనమున తెలియని మర్మ రహస్యాలు తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment