రోగంతో ఉన్నవారి నరాలను కదిలించే సంగీతాన్ని సృష్టించండి -
రోగాలు నశించి పోయేలా సంగీత సమ్మేళనాన్ని ఏర్పాటు చేయండి -
నాద వినోదం కన్నా స్వరారోగ్యాన్ని ప్రతి జీవికి అందించండి -
ఎటువంటి సూక్ష్మ అభ్యంతరము లేకుండా ఒక గడియయైనా సంగీతాన్ని అందించండి -
సంగీతాన్ని వింటుంటే మనిషి కోమాలో ఉన్నాడా లేదా మరణించాడా అనేటట్లు ఉండాలి -
ధ్యానిస్తూ సంగీతాన్ని వింటుంటే కైలాసమున శివుడు చలించి తన ఆత్మలో లీనమవ్వాలి -
సంగీతంలోని అద్భుతాలు విశ్వ రహస్యాలుగా విశ్వమందే దాగి ఉన్నాయి -
సంగీతాన్ని ఎక్కువ ధ్వని లేకుండా ఎవరైతే ఆరోగ్యంగా కదిలిస్తారో వారే విశ్వ వైద్యులు -
No comments:
Post a Comment