Sunday, July 18, 2010

మరోసారి మరో జన్మలో ఎలాంటి

మరోసారి మరో జన్మలో ఎలాంటి రూపాన్ని దాల్చెదవో
మానవ రూపము కాని రూపంతో ఆత్మ విజ్ఞానం కలగదే
ఆ రూపంతో కర్మను గాని విధిని గాని అనుభవిస్తే ఎలా
ఆ రూపమున గుణ భావ స్వభావాలు గొప్పగా లేకపోతే
మరలా మానవ రూపాన్ని పొందలేవని ఓ ఆలోచన
ఈ జన్మలోనే మానవ మేధస్సుతో ఆత్మ విజ్ఞానం చెందాలని
నా భావాలు నిన్ను అన్వేషిస్తూ దివ్య జ్ఞానాన్ని తెలుపుతున్నాయి
మరోజన్మ లేకుండా కర్మను నాశనం చేసుకోవటమే ముఖ్య సారాంశం
కర్మ నాశనమైతే ఆత్మ శూన్యాన్ని చేరి విశ్వ శక్తిలో భావమై నిలుస్తుంది
మహా భావాలతో విశ్వమున మర్మ తేజస్సుతో నిలిచిపోవాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment