ఒకే కుటుంబములో ఉన్న వారమే మేమంతా
అందరికి పెళ్ళిళ్ళు ఐన తర్వాత ఎవరికి వారు
భార్యా భర్తలుగా ఒక్కొక్క ఇంటిలో నివసిస్తున్నాము
నా సోదరుల ఇంటికి వెళ్ళితే నేను అతిధినేనని
వారు నా ఇంటికి వస్తే అతిధులేనా అనిపిస్తుంది
నా వారు నాతో విడిపోయారా అనే భావన కలుగుతుంది
పెళ్ళితో తల్లిదండ్రులు కూడా వస్తే అతిధులేమోననిపిస్తుంది
కాలము ఎలా మారుతుందో తోటి మనిషిని కూడా వేరు చేస్తుంది
విశ్వ జీవిత జీవన భావనలు అర్థం కావాలంటే పరమార్థమే తెలియాలి
అందరూ మన ఆత్మీయులే అనే భావనతో జీవించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment