నా హాష్యమున విశ్వ భాష దాగి ఉన్నది
ముఖములో హాష్యమున్నా భావనలో
ఎన్నో ప్రాపంచిక స్వభావాలు దాగున్నాయి
ఎవరికి తెలియనంతగా విశ్వ స్వభావాలు
నా మేధస్సులో ప్రతి క్షణం కలుగుతూ ఉంటాయి
నా రూప విశ్వ స్వభావాలను గుర్తించాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment