Friday, July 23, 2010

మేఘాల కదలికలో విశ్వమూ

మేఘాల కదలికలో విశ్వమూ కదులుతున్నట్లు
ఆకాశాన మేఘాలు వెళ్ళుతూ ఉంటే అనిపిస్తుంది
నక్షత్రాలు చంద్రుడు అలా మేఘాలలో వేగంగా వెళ్ళుతున్నట్లు
సముద్ర తీరాన అలల దిశ వైపు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది
మేఘాలు పూర్తిగా నల్లవైతే కనిపిస్తూ కనిపించక దాగి పోతుంటాయి
మేఘాలు ప్రయాణిస్తున్నంత వరకు విశ్వమూ ప్రయాణిస్తుందేమోనని
భూ గ్రహము భ్రమణంలా గాలికి ప్రయాణం సాగుతుందేమో
మేఘాలతో నీవు ప్రయాణించేలా విశ్వాన్ని తిలకించేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment