Friday, July 16, 2010

విశ్వమున ఏ జీవికైనా ముఖ్యమైనవి

విశ్వమున ఏ జీవికైనా ముఖ్యమైనవి ద్వితియములే
శరీరమున ఆహార జీర్ణ వ్యవస్థ మేధస్సున ఆహార అన్వేషణ
జీర్ణ వ్యవస్థ సరిలేకున్నా మేధస్సు సరిలేకున్నా
అనారోగ్యంతో అన్వేషణ తగ్గి జీవితం భారమవుతుంది
ఆరోగ్యం కోసం మేధస్సు అలాగే మేధస్సుకై ఆహారం
శరీర శక్తితో ఆలోచిస్తూ మేధస్సున విజ్ఞానం చెందుతూ
మరల మేధస్సుతో ఆహారానికై ఆలోచిస్తూ శ్రమిస్తున్నాం
జీవికి ముఖ్యమైనవి ద్వితియమైనా జీవించుటకు త్రితియములే
శ్రమించడం ఆలోచించడం కాలకృత్యాల శరీర ధర్మం
ఆహారం శరీర శక్తితో ఆరోగ్యానికి విజ్ఞానం మేధస్సు ఆలోచనతో ఆహార సేకరణకు
తక్కువ సమయంలో విజ్ఞానంతో ఆహారాన్ని సేకరిస్తే మరెన్నో కార్యాలు చేసుకోవచ్చు
మరెన్నో కార్యాలకు మరెంతో శక్తికై ఆహారమే ప్రధానమైనది
క్షణంలో మరెన్నో కార్యాలను విజ్ఞానంగా చేయుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment