Monday, July 19, 2010

మనస్సులో ఏమున్నా క్షణ కాలమే

మనస్సులో ఏమున్నా క్షణ కాలమే నిలుస్తుంది
మరో క్షణాన మరో విషయంతో ఆలోచిస్తుంటుంది
మేధస్సుతో కేంద్రీకరిస్తే ఏకాగ్రతతో కొంత కాలం
ఓ విషయాన్ని ఆలోచిస్తూ అర్థాన్ని గమిస్తుంది
అర్థం తెలిసిన తర్వాత విషయం జ్ఞానంగా మారి
మేధస్సున చేరి మరల మరో విషయాన్ని అన్వేషిస్తుంది
ఏకాగ్రతలో కూడా వేర్వేరు సూక్ష్మ విషయాలను ఆలోచిస్తుంది
మనస్సులోని విషయం కన్నా మేధస్సులోని జ్ఞానమే గొప్పది
మేధస్సుతో మనస్సును ఆలోచింపజేస్తే ఎన్నో అర్థాలు తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment